Preity Mukhundhan pairs with Manchu Vishnu in ‘Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కు జోడీ గా ప్రీతి ముకుందన్!

kannappa heroine 1 e1702551510187

ప్రస్తుతంభారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్ప మీద దేశ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ కన్నప్ప ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ మరో ప్రకటన చేశారు. ఈ చిత్రంలో డైనమిక్ స్టార్ విష్ణు మంచు సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నారు. ఈ మేరకు టీంలోకి ఆమెను స్వాగతించింది కన్నప్ప చిత్రయూనిట్.

kannappa vishnu and Mohan lal

ప్రీతి నటించబోతున్న కీలక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఎన్నో రకాల ఆడిషన్స్ తరువాత ప్రీతి ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చిత్రయూనిట్ భావించింది. విష్ణు మంచు, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి వారు నటిస్తున్న ఈ కన్నప్ప మూవీతో ప్రీతి కెరీర్ లో మరో స్థాయికి వెళ్లనున్నారు.

kannappa heroine

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి.. తన భరతనాట్య కళతో పాత్రకు ప్రాణం పోయనున్నారు. ‘కన్నప్ప’లోని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటుగా ఆమె నృత్య నైపుణ్యం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు.

kannappa opening

దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..‘ప్రీతీకి ఇది తొలి సినిమా మాత్రమే కాదు. కళ, సినిమా రంగాల గురించి మరింత ఎక్కువగా నేర్చుకునే ప్రపంచంలోకి వచ్చింది. ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఆమెతో కలిసి పనిచేయడానికి టీం అంతా ఎదురుచూస్తోంది’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *