Pawan Kalyan Birthday special: పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ప్రేమదేశపు యువరాణి’ మూవీ రిలీజ్‌ అంటున్న   రాయపాటి అరుణ !

IMG 20230829 WA0055

 

పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని అయిన సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులు. ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2హెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మిస్తున్నారు.

IMG 20230829 WA0059

ఇటీవల ఈ చిత్రంలోని ‘మసకతడి’ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోపాటను ఆవిష్కరించారు. ‘నిశబ్దం’ అంటూ సాగే పాటను జనసేన పార్టీ స్పోక్స్‌ పర్సన్‌ రాయపాటి అరుణ చేతుల మీదుగా విడుదల చేశారు. అజయ్‌ పట్నాయక్‌ సంగీతం అందించిన ఈ పాటను సునీత ఆలపించారు.

IMG 20230829 WA0055

చిత్ర దర్శకుడే ఈ పాటను రాయడం విశేషం. పాటను విడుదల చేసిన అనంతరం రాయపాటి అరుణ చిత్రం బృందానికి శుభాకాంక్షలు తెలిపి, సినిమా సక్సెస్‌ కావాలని అభిలషించారు. పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అయిన దర్శకుడు సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారు.

IMG 20230829 WA0056

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ ఇది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే బాండింగ్‌తో సినిమా జ్ఞాపకాలను ఇంటికి తీసుకెళ్తారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది.

IMG 20230829 WA0061

రాయపాటి అరుణగారు లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌, పాటలకు చక్కని స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అలాగే సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.

IMG 20230829 WA0058

నటీనటులు:
మెహబూబ్‌ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్‌, పవన్‌ ముత్యాల, రాజారెడ్డి, సందీప్‌, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు.

సాంకేతిక నిపుణులు:
కెమెరా: శివకుమార్‌ దేవరకొండ,
సంగీతం: అజయ్‌ పట్నాయక్‌,
ఎడిటర్‌: ఎం.ఆర్‌. వర్మ
పాటలు: కాసర్ల శ్యామ్‌, సాయి సునీల్‌ నిమ్మల, భాను–కృష్ణ,
సౌండ్‌ మిక్స్‌: జయంతన్‌ సురశ్‌
కొరియోగ్రఫీ: కపిల్‌, శ్రీవీర్‌
సౌండ్‌ ఎఫెక్ట్స్‌: పురుషోత్తం రాజు,
ఫైట్స్‌: శివ్‌రాజ్‌
డిఐ: వెంకట్‌
స్టిల్స్‌ జగన్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహి
మేకప్‌: అనిల్‌, భాను
పీఆర్వో: మధు విఆర్‌
పబ్లిసిటీ డిజైనర్‌: ఎంకెఎస్‌ మనోజ్‌
పోస్ట్‌ ప్రొడక్షన్స్‌: సారథి స్టూడియోస్‌
నిర్మాతలు: ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌
రచన – దర్శకత్వం: సాయి సునీల్‌ నిమ్మల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *