వెబ్ సిరీస్: మీట్ క్యూట్ (Meet Cute)
ఓటీటీ ప్లాట్ ఫామ్: సోనీ లీవ్ (Sony Liv)
స్ట్రీమింగ్ తేదీ : నవంబర్ 25, 2022
నటీనటులు: అశ్విన్ కుమార్, వర్ష బొల్లమ్మ, శ్రీ విద్యా పి, సమీర్ మల్ల, సత్యరాజ్, రుహాని శర్మ, రాజా చెంబోలు, రోహిణి, ఆకాంక్ష సింగ్, సురేఖా వాణి, ధీక్షిత్ శెట్టి, శ్రీప్రియ ఇదూరి, అదా శర్మ, అలేఖ్య హారిక, శివ కందుకూరి, సంచి పూనాచా, సునైనా , గోవింద్ పద్మసూర్య, కివిష్, కళ్యాణి నటరాజన్, డిడి శ్రీనివాస్
దర్శకుడు : దీప్తి గంటా
నిర్మాతలు: గంటా నవీన్ బాబు, ప్రశాంతి త్రిపురనేని
సంగీత దర్శకులు: విజయ్ బల్గానిన్
సినిమాటోగ్రఫీ: ఎ.వసంత్
ఎడిటర్: గ్యారీ బి హెచ్

మీట్ క్యూట్ వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ:
సోనీ లీవ్ ఓటిటి లో న్యాచురల్ స్టార్ నాని అక్క దీప్తి గంటా రచించి దర్శకత్వం వహించిన బ్యూటిఫుల్ అంథాలజీ సిరీస్ మీట్ క్యూట్ (ఐదు కధల) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి ముందే మంచి బజ్ ని క్రియేట్ చేసింది.
టీజర్ మరియు ట్రైలర్ లతో ఆసక్తి రేపిన ఈ సిరీస్ నాచురల్ స్టార్ నాని సమర్పణలో తన సోదరి ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా నాని అక్క దీప్తి గంట దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ నవంబర్ 25 నుండి సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో మా 18 యఫ్ మూవీస్ రివ్యూ లో చదివి తెలుసుకుందాం రండి.

కధ (STORY) పరిశీలిస్తే:
మీట్ క్యూట్ సిరీస్ కథలోకి వెళ్తే ఈ సిరీస్ లో ఒకో ఎపిసోడ్ లో పలు పాత్రలు మరియు వారి మధ్య కథలు కనిపిస్తాయి.
మొదటి ఎపిసోడ్: మీట్ ది బాయ్ (Meet The Boy)
మొదటగా ‘మీట్ ది బాయ్’ అనే ఎపిసోడ్ లో యువ నటి వర్ష బొల్లమ్మ పాత్ర కనిపిస్తుంది. ఆమె ఓ స్ట్రేంజర్ ని కలవడం వారి కలయిక ఎక్కడికి వెళ్ళింది దాని స్టోరీ ఏంటి అనేది తెలుస్తుంది.
రెండవ ఎపిసోడ్: ఓల్డ్ ఈజ్ గోల్డ్’ (Old Is Gold)
అలాగే నెక్స్ట్ ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే దానిలో రుహాణి శర్మ, నటుడు సత్యరాజ్ ల పాత్రలు వారి మధ్య కథ ఏంటి, వారు ఎందుకు కలుస్తారు అనేది ఉంటుంది.
మూడవ ఎపిసోడ్: ఇన్ లవ్ లవ్ ( In L(aw)ove)
అలాగే తర్వాత ఓ తల్లి(రోహిణి) తన కొడుకు గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఏం చేస్తుంది. ఈ కథ ఎటువంటి ఎమోషన్స్ తో ఉంటుంది అనేది తెలుస్తుంది.
నాలుగోవ ఎపిసోడ్: స్టార్ స్ట్రక్ (Star Struck)
అలాగే నెక్స్ట్ కథలో సినిమాల్లో ఓ పెద్ద స్టార్ ని ఓ డాక్టర్ కలవడం ఇది ఆదా శర్మ మరియు శివ కందుకూరి మధ్యలో కనిపిస్తుంది.
ఐదవ చివరి ఎపిసోడ్: ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ (Ex-Girlfriend)
ఇక చివరిగా అయితే తన భర్త ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అయ్యే ఓ భార్య కథగా ఇది సునైనా మరియు సంచిత పూనాచా ల మధ్య కనిపిస్తుంది.
ఇలా వీరంతా ఎందుకు ఎలా మీట్ అయ్యారు?
దీని వెనుక ఉన్న మెయిన్ పాయింట్ ఏంటి?
మనుషుల మధ్య భందవ్యాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ?
కొత్తవారితో కలిస్తే ఏమి చేయాలి ?
అసలు కొత్తవారిని (స్ట్రెజర్స్) కాలవ వచ్చా లేదా ?
వయస్సుని బట్టి మన ఆలోచన విధానం మారుతుందా ?
అన్నీ రిలేషన్స్ కి వయస్సు అసలు సంభందం కాదా ?
వంటి ప్రశ్నలు మీకు ఇంటరెస్టింగ్ గా ఉంటే మీ ఫ్యామిలీ తో కలసి సాయంకాలం అన్నీ పనులు అయిపోయిన తర్వాత హాయిగా చూస్తూ మీ అనుభవాలు కూడా చర్చిస్తే ముందు ముందు అపరచితులతో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది.

కధ కథనం (SCREEN – PLAY) పరిశీలిస్తే:
ఈ సిరీస్ లో అందరికీ అని చెప్పలేం కానీ ఓటిటి కోసం ఈ సిరీస్ ని తెరకెక్కించడం వలనో ఏమో కానీ చాలా వరకు మాటలు ఇంగ్లీష్ లోనే ఉంటాయి. ఇది అందరికీ వెంటనే అర్ధం కాకపోవచ్చు.
అలాగే ఆల్ మోస్ట్ అన్ని ఎపిసోడ్స్ బాగానే అనిపిస్తాయి కానీ స్టార్ స్ట్రక్ అనే ఎపిసోడ్ మాత్రం ఎందుకో మిగతా వాటితో పోలిస్తే అంత ఎఫెక్టివ్ గా స్క్రీన్ ప్లే లేదు అనిపిస్తుంది.
ఇంకా ఈ తరహా సిరీస్ లలో అంటే అక్కడక్కడా స్లో నరేషన్ తప్పనిసరి వీటి మూలాన కొద్దిగా బోర్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా కొంచెం అఫ్ఫెక్టివ్ గా కధనం రాసుకొని ఉంటే బాగా ఉండేది. అలాగే కేవలం ఎంటెర్టైనెంట్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది.

దర్నకురాలి ప్రతిభ, నటుల నటన పరిశీలిస్తే:
క్యూట్ మీట్ సిరీస్ కి సంబంధించి వచ్చిన టీజర్ మరియు ట్రైలర్ లు చూసినప్పుడే మంచి చాలా ఇంటరెస్టింగ్ కంటెంట్ అనిపించింది.
ఏదైయితో ప్రామిసింగ్ నరేషన్ ఈ సిరీస్ కి సంబంధించి టీజర్ మరియు ట్రైలర్ లు చూసినప్పుడే మంచి ప్రామిసింగ్ గా అనిపించాయి. మరి అదే ప్రామిసింగ్ నరేషన్ అయితే ఈ సిరీస్ లో వీక్షకులకు డెఫినెట్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు.
పూర్తిగా స్ట్రెంజర్స్ అంటే ఒకరికి ఒకరు పరిచయం లేని వారు కలిస్తే వారి మధ్య మాటలు, ప్రవర్తన మరియు ఏమోసన్ ఎలా ఉంటాయి అనేవి చక్కగా కధ లు గా రాసుకొని స్క్రీన్ ప్లే (కధనం ) లో కూడా చూపించడం వలన చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి.
చాలా చక్కటి నరేషన్ తో తన మొదటి అటెంప్ట్ లోనే దీప్తి గంట సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే ప్రతి కథలో చూపించిన అన్ని ఎమోషన్స్ సహా వాటికి ఇచ్చిన ముగింపులు అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. డెఫినెట్ గా అయితే దీప్తి గంట నుంచి మరిన్ని ఈ తరహా కొత్త అటెంప్ట్ లను మనం ఆశించవచ్చు.
ఇక ఈ సిరీస్ లో మరో పెద్ద హైలైట్ ఏమన్నా ఉంది అంటే అది క్లీన్ గా ఓ మెలోడ్రామా లా సాగే ఇంట్రెస్టింగ్ నరేషన్ అని చెప్పొచ్చు. ప్రతి ఎపిసోడ్ లో సెమ్ మూడ్ అండ్ డ్రామా కంటిన్యూ అయ్యింది .
నటుల విశయానికి వస్తే ఈ అన్ని ఎపిసోడ్స్ లో అందరికీ బాగా టచింగ్ గా అనిపించేది నటి రోహిణి మరియు ఆకాంక్ష సింగ్ ల లవ్(లా) ఎపిసోడ్ అని చెప్పాలి.
తన కొడుకు పెళ్లి విషయంలో తల్లి ఏం చేస్తుంది ఈ ఎపిసోడ్ లో తన కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఆకాంక్ష మధ్య కన్వర్జేషన్ వారి నటన తీరు సాలిడ్ గా కనిపిస్తాయి.
అలాగే ఇతర నటీనటులు వర్ష బొల్లమ్మ, అదా శర్మ, శివ కందుకూరి మంచి నటన కనబరిచి ఎమోషనల్ గా ఆకట్టుకుంటారు. అలాగే రుహాణి శర్మ, వెర్సటైల్ నటుడు సత్య రాజ్ ల ఎపిసోడ్ కూడా మంచి ఆసక్తిగా అంతకు మించి అర్ధవంతంగా కూడా అనిపిస్తుంది.
అలాగే లాస్ట్ ఎపిసోడ్ సునైనా పై చూపించేది అందులోని ట్విస్ట్ లు వీక్షకులను ఇంప్రెస్ చేస్తాయి.
ఓవరాల్ గా అయితే ఈ అంథాలజీ సిరీస్ చాలా కాలం తర్వాత ఓ బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్ ని చూసే వీక్షకులకు అందిస్తుంది. చాలా క్లీన్ నరేషన్ తో హత్తుకునే డైలాగ్స్ తో ఎక్కడా కూడా అతిగా అనిపించకుండా చాలా నీట్ గా ఈ సిరీస్ అయితే కొనసాగుతుంది.
మన తెలుగు ఇండిస్ట్రీ నుంచి ఈ తరహా ఓ ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ కంటెంట్ రావడం మంచి విషయం అని చెప్పాలి. అది కూడా మన న్యాచురల్ స్టార్ నాని ఫ్యామిలీ నుండి రావడం వలన చాలా న్యాచురల్ గా ఉంది.

సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు సినిమా స్తాయిలో ఉన్నాయని చెప్పాలి. ఈ సిరీస్ నేపథ్యం కోసం క్రియేట్ చేసిన ప్రతీ సెటప్ అలాగే ఆ అట్మాస్పియర్ లో నిర్మాత పడిన తపన ఖర్చు కనిపిస్తాయి.
అలాగే టెక్నికల్ టీం లో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్ వర్క్ లు ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరి టీం వర్క్ కూడా ఈ సిరీస్ సక్సెస్ కి దోహదపడ్డాయి.

18FMovies టీం ఒపీనియన్ :
ఈ “మీట్ క్యూట్” ఆంథాలజీ సిరీస్ టైటిల్ కి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తూ ఓ ఫ్రెష్ నరేషన్ తో బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో ఓటిటి ఆడియెన్స్ ని మెప్పిస్తుంది.
ముక్యంగా దర్శకురాలు దీప్తి గంటా ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ అందులోని తన మొదటి ప్రాజెక్ట్ తోనే తన ప్రతిభను కనబర్చడం చాలా హర్షణీయం. అనేకమంది నటీనటులను సమర్ధవంతంగా డీల్ చేసి సూపర్బ్ అవుట్ పుట్ ని రాబట్టడం చిన్న విషయమేమి కాదు.
మీట్ క్యూట్ సిరీస్ డెఫినెట్ గా వీక్షకులకు మంచి ట్రీట్ నిఇస్తుంది. ఈ సిరీస్ ని ఓటిటి లో ఫ్యామిలీ మొత్తం తప్పకుండా వీక్షించి ఎంజాయ్ చెయ్యవచ్చు.
18f మూవీస్ రేటింగ్ : 3.25 / 5
- కృష్ణ ప్రగడ.