మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ “చక్రవ్యూహం” ది ట్రాప్ పోస్టర్ కి విశేష స్పందన

chakravyuham poster launch Copy e1672651612398

 

సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీమతి.సావిత్రి నిర్మిస్తున్న చిత్రం “చక్రవ్యూహం” ది ట్రాప్. ఈ చిత్రంలో ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు.

chakravyuham poster launch 2

తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు సినిమా స్థాయిని పెంచారు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారు. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబోయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70 ఎం. ఎం. మూవీ డైరెక్టర్ కమ్ హీరో… చిత్రసీమలో డేరింగ్ డాషింగ్ అనే పదాలకు నిలువెత్తు నిర్వచనంగా మారి, తెలుగు చిత్రపరిశ్రమకు ఒక సరికొత్త టెక్నలాజినీ పరిచయం చేసిన స్వర్గీయ శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారు చివరగా ఈ సినిమా పోస్టర్ ను లాంచ్ చేసారు.

chakravyuham poster launch 1 Copy

ఈ పోస్టర్ ను లాంచ్ చేసిన కృష్ణ గారు ఈ చిత్ర బృందానికి ఆశీస్సులు అందించారు. ఈ లాంచ్ చేసిన పోస్టర్ లో పోలీస్ పాత్రలో ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్న అజయ్ ను మనం గమనించవచ్చు. ఈ సినిమా మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీమతి సావిత్రి నిర్మాతగా, వెంకటేష్, అనూష సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది.

chakravyuham poster launch Copy
సాంకేతిక సిబ్బంది:
రచన మరియు దర్శకత్వం: చెట్కూరి మధుసూధన్
నిర్మాత: శ్రీమతి.సావిత్రి
సహ నిర్మాతలు: వెంకటేష్, అనూష
బ్యానర్: సహస్ర క్రియేషన్స్
సంగీత దర్శకుడు: భరత్ మంచిరాజు
సినిమాటోగ్రఫీ: జివి అజయ్
ఎడిటర్: జెస్విన్ ప్రభు
ఫైట్స్: రాబిన్ సుబ్బు
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అజయ్, మహేష్
కలరిస్ట్: షణ్ముఘ పాండియన్
పి.ఆర్.ఓ: మేఘా శ్యామ్
డిజిటల్ మీడియా: ప్రసాద్, ధీరజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *