మైత్రి మూవీస్ ద్వారా జూన్ 23న గ్రాండ్ గా విడుదల కానున్న “భీమదేవరపల్లి బ్రాంచి” చిత్రం.

BD branch5 e1686032102418

డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు.

BD branch2

రమేష్ చెప్పాల రచన-దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో … నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, సీనియర్ నేత అద్దంకి దయాకర్ నటించడం సినిమా మీద ఆసక్తి రేకిస్తోంది.

BD branch4

ఈ మధ్య “భీమదేవరపల్లి బ్రాంచి” ప్రివ్యూ షో చూసిన సినీ ప్రముఖులు, ఐదుగురు మినిస్టర్స్, ముగ్గురు ఎంపీలు ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని రచయిత, దర్శకుడు రమేష్ చెప్పాల మీద ప్రశంసలు కురిపించారు.

“భీమదేవరపల్లి బ్రాంచి” ఒక ఆర్గానిక్ గ్రామీణ చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. ఆ హాట్ టాపిక్ ఆధారంగా ఈ సినిమాను”నియో రియలిజం” జానర్లో చిత్రీకరించారు.

BD branch3

ఈ జానర్లో వస్తున్న మొదటి తెలుగు చిత్రం”భీమదేవరపల్లి బ్రాంచి” కావడం విశేషం. కథలోని నేటివిటీ పోకూడదని పూర్తిగా థియేటర్ & ఆర్గానిక్ నటీనటులనే ఎంపిక చేసుకుని, చాలా రియాలిటీగా తెరకెక్కించబడిన కంటెంట్ ఓరియంటెడ్ స్పెషల్ మూవీ భీమదేవరపల్లి బ్రాంచి.. రెండు గంటలు పల్లె వాతావరణం కళ్ళ ముందు కదలాడుతుంది.

ప్రతి ఒక్కరిని తమ గ్రామానికి తీసుకెళ్తుంది. ఇక ఇప్పటికే విడుదలకి సిద్ధమైన ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద ఆసక్తి రేకెత్తించగా ఈ సినిమా కంటెంట్ నచ్చి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

BD branch
నటీ నటులు:
అంజి వల్గమాన్, సాయి ప్రసన్న,సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్),రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్ (బీ.ఎస్),శుభోదయం సుబ్బారావు,గడ్డం నవీన్,వివ రెడ్డి, సి ఎస్ ఆర్,నర్సింహ రెడ్డి,పద్మ,మానుకోట ప్రసాద్,, తాటి గీత,మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, కటారి, రజిని, సుష్మా.

BD branch6

సాంకేతిక నిపుణులు:
రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల.
నిర్మాతలు: డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి.
కెమెరా: కె.చిట్టి బాబు.
సంగీతం: చరణ్ అర్జున్,
సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ. సంజయ్ మహేష్ వర్మ,
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి.
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే.
పిఆర్ఓ: సురేశ్ కొండేటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *