మూవీ: మ్యాడ్ (MAD)
విడుదల తేదీ : అక్టోబరు 06, 2023
నటీనటులు: నార్నే నవీన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియ, ఆనంతిక, గోపిక ఉదయన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు ఆంటోనీ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు
దర్శకుడు : కళ్యాణ్ శంకర్
నిర్మాతలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్
సంగీతం: భీమ్స్
సినిమాటోగ్రఫీ: షామ్ దత్, దినేష్ క్రిష్ణన్
ఎడిటర్: నవీన్ నూలి
మూవీ రివ్యూ: మ్యాడ్ (MAD Review)
టాలీవుడ్ లేటెస్ట్ గా పూర్తిగా కాలేజీ స్టూడెంట్స్ కధ తో వచ్చిన సినిమా ఏది లేదు అని చెప్పవచ్చు. ఆ గాప్ ని ఫిల్ చేస్తూ దర్శకుడు కళ్యాణ్ మంచి యూత్ కధ ను రాసుకొని తీసిన సిన్మా నే “మ్యాడ్”. జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ మరో పాత్రలో పరిచయం చేస్తూ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ మ్యాడ్ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో మా 18F మూవీస్ టీం సమీక్ష లో చదివి తెలుసుకొందామా !
కథ ని పరిశీలిస్తే (Story line):
మ్యాడ్ కథలోకి వస్తే.. Manoj (రామ్ నితిన్) Ashok (నార్నే నితిన్), DD aka Damodhar (సంగీత్ శోభన్ ) ముగ్గురు పేర్లలోని మొదటి అక్షరం తో ఏర్పడినదే MAD కధ. ఈ ముగ్గురూ ఓ ఇంజినీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయి హాస్టల్ మేట్స్ గా కలుస్తారు. ఈ ముగ్గురు అల్లరితో మొత్తం హాస్టల్ స్టూడెంట్స్ తో నడిచే డ్రామానే మ్యాడ్ కి ఫ్యూయల్.
ఈ ముగ్గురి పర్సనల్ లైఫ్ లో అలాగే వారి కాలేజ్ హాస్టల్ లైఫ్ లో జరిగే ఫన్ ఇన్సిడెంట్స్ ఏంటి?
గర్ల్ స్టూడెంట్స్ జెన్నీ(ఆనంతిక) శృతి(గౌరీ ప్రియ) ల పాత్రలు ఏంటి?
DD మనోజ్ ఎదుర్కొన్న సంగటనలు ఏంటి ?
ట్రైలర్ లో చూపినట్టు మనోజ్ నిజంగానే అమ్మాయిల పిచ్చోడా ?
సంగీత్ లైఫ్ లోకి అమ్మాయి వద్దు అనుకొనే వాడు అమ్మాయి ఫోన్ కోసం ఎందుకు తపిస్తాడు?
అశోక్ ఎందుకు మూడిగా ఉంటాడు ?
అశోక్ మనోజ్ కలిసి చేసిన పిచ్చి పని ఏంటి ?
క్లైమాక్స్ లో సంగీత్ ఎందుకు ఎమోషనల్ అవుతాడు ?
3 ఇడియట్స్ సినిమాని పోలిన ఈ ముగ్గురు జర్నీ కాలేజీ హాస్టల్ లో ఎలా సాగింది అనేది తెలియాలి అంటే ఈ మ్యాడ్ రైడ్ థియేటర్స్ లో చూడాల్సిందే. అందరూ తప్పక కలిసి దియేటర్ లో చూడవలసిన సినిమా ఈ మ్యాడ్.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
మ్యాడ్ చిత్రంలో చూపిన కామెడీ సీన్స్ అన్ని వర్గాల సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టం. కధ పాతదే అయిన, ఎన్నో సినిమాలలో మనం చూసినా కధనం (స్క్రీన్ – ప్లే ) తో దర్శకుడు మరో రకమైన కామెడీ పండించాడు. ఈ మ్యాడ్ కధ సినిమా గా చూస్తుంటే మనకు బాగానే ఉంది కానీ ఆల్రెడీ మనకి తెలిసిందే చూస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది కానీ కొత్తగా అనిపిస్తాయి సీన్స్.
దర్శకుడు అనుదీప్ ని నటుడిగా పూర్తిగా వాడుకోలేదు. జనాలలో బాగా పాపులారిటీ సంపాదించుకొన్న అనుదీప్ పై ఇంకా కొన్ని మంచి కామెడీ సీన్స్ పెట్టి ఉంటే హిలేరియోస్ ఫన్ జెనరేట్ అయ్యి స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేసేవారు. మరో రకంగా చూస్తే అసలు ఈ మ్యాడ్ సినిమాలో ఒక కథాంశం అనేది ఏది లేదు. జస్ట్ ఒక కాలేజ్ హాస్టల్, ముగ్గురు హీరోలు హీరోయిన్స్ తప్ప ఇంకేమి లేదు. కానీ లాజిక్కులు పెద్ద పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేయకుండా కొత్త కుర్రాళ్ల అల్లరి చూడాలి అనుకొనే వారికి ఫుల్ 100% ఎంటర్టైనర్ అని చేపవచ్చు.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
దర్శకుడు కళ్యాణ్ శంకర్ తాను కొత్త కథ, కథాంశాలు ఏమి ఎంచుకోలేదు కానీ యూత్ కి కావాల్సిన ఓ ఎంటర్టైనర్ ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. కొన్ని కామెడీసీన్స్ ని మాత్రం అద్బుతంగా రాసుకొని డీసెంట్ గా ప్రెజెంట్ చేసాడు. గతం లో వచ్చిన లైఫ్ ఇస్ బ్యూటీఫుల్, జాతి రత్నాలు, త్రీ ఇడియట్స్ వంటి సినిమాల సక్సెస్ ఫోరములను తన కధ కు ఇంధనం గా వాడుకొని ప్రస్తుత ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ ఇన్సిడెంట్స్ ని కధనం లో వ్రాసుకొని ఒక కొత్త రకం డిష్ ప్రెసెంట్ చేశాడు అని చెప్పవచ్చు.
నార్నే నితిన్ అయితే డీసెంట్ లుక్స్ అండ్ నీట్ పెర్ఫార్మన్స్ ని కనబరిచాడు అలాగే తన డాన్స్ అండ్ యాక్షన్ బాగుంది. మొదటి సిన్మా అయిన చక్కగా నటించి మెప్పించాడు.
ముఖ్యంగా చెప్పుకోవాలసింది DD గా చేసిన సంగీత్ శోభన్ గురించి. టోటల్ మ్యాడ్ పెర్ఫార్మెన్స్ తో సినిమా ని తన నటనతో ఎక్కడికో తెసుకువెళ్ళి పోయాడు. తన ఈజ్ కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేశాడు. ముగ్గయిరీలోనూ ఎక్కువ స్క్రీన్ స్పేస్ తో పాటు హంగామా చేసింది మాత్రం సంగీత శోభన్ మాత్రమే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి కి చక్కని కామిడీ టైమింగ్ ఉన్న మరో నటుడు దొరికినట్టే .
అలానే రామ్ నితిన్ తన మంచి హ్యాండ్సమ్ లుక్ లో కనిపించి డీసెంట్ పెర్ఫార్మన్స్ కనబరిచాడు. ఇక వీరికి జంటగా కనిపించిన హీరోయిన్స్ ఇంకా ఇతర కమెడియన్స్ నటుడు రఘుబాబు తదితరులు మంచి పాత్రల పరిది మేరకు మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకొన్నారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
టెక్నీకల్ టీం లో ముందుగా చెప్పుకో వలసింది భీమ్స్ మ్యూజిక్. తన మార్క్ ఫోక్ సాంగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి.
షామ్ దత్, దినేష్ క్రిష్ణన్ సినిమాటోగ్రఫీచక్కగా ఉంది. ప్రతి ప్రేమ్ ప్రతి సీన్ అద్భుతంగా వచ్చాయి. ఎక్కువ క్రౌడ్ లో కూడా చాలా డీటైల్ గా ఉంది కెమెరా వర్క్.
నవీన్ నూలి ఎడిటింగ్ కూడా సినిమా కి ప్లస్ అయ్యింది. కొన్ని డైలాగ్స్ ఫాస్ట్ గా కట్ అయినా జర్క్ లేకుండా బాగానే మేనేజ్ చేశాడు.
ఈ చిత్రం నిర్మాతలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ సంస్థ లు ఎక్కడ రాజీ పడకుండా పెట్టిన ఖర్చు చిత్ర నిర్మాణం లో బాగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించారు. కొత్త నటి నటులే కదా అని వదిలేయకుండా ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపించడానికి సినీయర్ టెక్నీషియన్స్ సేవలు వాడుకొన్నారు.
18F మూవీస్ టీం ఒపీనియన్:
ఈ సినిమా పేరు “మ్యాడ్” కి తగ్గట్టుగానే ఒక క్రేజీ ఫన్ రైడ్ ని ఓ ఎంటర్టైనర్ కావాలి అని కోరుకునేవారికి ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ కి కిక్ ఇచ్చే సినిమా. వెండి తెర కు తొలి పరిచయం అయినా నార్నే నితిన్, సంగీత్ శోభన్ మరియు రామ్ నితిన్ లు మంచి నటనతో సినిమా ని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్లారు.
ఓ ముగ్గురు ఆకతాయి ఫ్రెండ్స్ కాలేజీ హాస్టల్ లో కలిస్తే వచ్చే ఆ ఇన్స్టంట్ కామెడీ సాలిడ్ గా ఈ సినిమాలో వర్కవుట్ అయ్యింది. చాలా సీన్స్ అయితే మంచి సిట్యువేశనల్ ఫన్ ని జెనరేట్ చేస్తాయి. అలాంటి ఎపిసోడ్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాలసినది గర్ల్స్ హాస్టల్ ఎపిసోడ్. అలానే క్లైమాక్స్ లో వచ్చే కామెడీ సీన్ అయితే మరింత క్రేజీ అండ్ హైలైట్ గా నిలిచింది.
ఓవరాల్ గా చూస్తే రెగ్యులర్ కాలేజీ హాస్టల్ కధ, సినిమాటిక్ సీన్స్ అని చూడకుండా మంచి ఫన్ రైడింగ్ కామిడీ చిత్రం చూడాలి అనుకొంటే ఈ వారంతానికి ఫ్యామిలీ ఆడియన్స్ కి డీసెంట్ ఎంటర్టైన్ గాను, కాలేజీ స్టూడెంట్స్ కి మంచి కిక్ ఇచ్చే చిత్రంగాను నిలిస్తుంది మ్యాడ్ చిత్రం.