తెలుగు సినిమా ఇండిస్ట్రీ లో నవంబర్ నెల సమంత కి ప్రొడ్యూసర్ కృష్ణ ప్రసాద్ గారికి చాలా మంచి నెల.
తెలుగు లో పెద్ద హీరోల, సూపర్ స్టార్ల సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు. సమంత నటించిన యశోద సినిమానే నవంబర్ నెల మొత్తానికి పెద్ద సినిమా అంటే ఓ 50 కోట్ల సినిమాగా నిలిచింది.
ఈ నెలలో కొన్ని చిన్న సినిమా గా వచ్చి మెరుపులు మెరిసాయి. తమ సత్తా తో బాక్స్ ఆఫీసు లో బాంబుల్లా పేలి. సినిమా ప్రొడక్షన్ ఆఫీసులో టపాకాయలు కాల్చుకొనేలా చేశాయి. వాటి వివరాలు మా 18ఎఫ్ మూవీస్ పాఠకుల కోసం ఇక్కడ ఇస్తునము. చదవండి.
మొదటివారంలో వచ్చిన సినిమాలు…అల్లు ఆర్ట్స్ లో చిన్న హీరో (బడ్జెట్ పరంగా) అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా రిలీజైంది. పూర్తిగా పెళ్ళయిన యువతను టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా యూత్ లో మంచి టాక్ తెచ్చుకుంది.
అలానే చివరాకరకు అన్నట్టు అల్లు శిరీష్ కు ఓ హిట్ బొమ్మ పడి సక్సెస్ ఇమేజ్ ను కట్టబెట్టింది అనే చెప్పాలి. అయితే కమర్షియల్ గా చూసుకుంటే ఊర్వశివో రాక్షసివో చిత్రం ఎంత సక్సెస్ అయ్యింది అనేది ఆ చిత్ర పంపినిధారుడు శిరీష్ తండ్రి అల్లు అరవింది గరికే తెలియాలి. ఎందుకంటే గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నంబర్స్ అన్నీ సీక్రెట్ కాబట్టి.
సినీ పండితుల లెక్కల ప్రకారం ఊర్వశివో రాక్షసివో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ప్రస్తుత ఓటీటీ హవలో థియేట్రికల్ సిస్టమ్, ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోవడంతో, అల్లు శిరీష్ నటన కోసం థియేటర్లకు వెళ్లేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపించలేదు, దాని ఫలితంగా అల్లు కుటుంబానికి ఆనందం, సినిమా బయ్యర్లకు బాధలు మిగిలాయి అంటున్నారు.
ఈ ఊర్వశివో రాక్షసివో సినిమాతో పాటు జెట్టి, బొమ్మ బ్లాక్ బస్టర్, బనారస్, లైక్ షేర్ & సబ్ స్క్రైబ్, సారధి, తగ్గేదేలే, ఆకాశం సినిమాలు కూడా ఒకేసారి 1+3 క్లీరెన్స్ సేల్ అన్నట్టు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటి ఆకట్టుకోలేకపోయింది. చివరికి సంతోష్ శోభన్- మేర్లపాక గాంధీ కాంబోలో వచ్చిన లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ కూడా సినిమా బాగుంది అన్న వాళ్ళే డిజాస్టర్ అకౌంటు లో వేసేశారు.
రెండో వారంలో వచ్చిన సినిమాలు.. సమంత సోలో హీరో గా నటించిన యశోద సినిమా వచ్చింది. మంచి అంచనాల మధ్య రిలీజ్ కి ముందే డిజిటల్ -శాటిలైట్ బూసినెస్ హ్యాపీ గా చేసుకొని డీయేటర్స్ లో ఎంత వచ్చిన ప్రాఫిట్ నే అని వచ్చిన ఈ సినిమా ఆ అంచనాల్ని నిలబెట్టుకుంది.
సమంత కెరీర్ లో పెద్ద సక్సెస్ ఫుల్ పాన్ -ఇండియా సినిమాగా నిలిచింది యశోద. ఇకపై కూడా ఫిమేల్ లీడ్ సినిమాలు తన బుజన వేసుకొని మోయగలదు అనే విదంగా సమంత నటించి ప్రేక్షకులను మెప్పించింది అని సినీ పండితులు చెప్పుకొచ్చారు.
ఈ మూవీతో పాటు వచ్చిన నచ్చింది గర్ల్ ఫ్రెండ్, మది, ఇన్ సెక్యూర్, క్లూ, ఆధారం సినిమాలు వచ్చినట్టు సినీ మీడియా లో అందరికీ తెలియదు అలానే రెండో రోజుకే ఫ్లాప్ స్టాంప్ తో తిరుగు ప్రయాణం అయ్యాయి.
మూడో వారంలో వచ్చిన సినిమాలు.. సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సుడిగాలి లా వచ్చింది. దీంతో పాటు మసూద అనే హారర్ థ్రిల్లర్ కూడా వచ్చింది. ఈ రెండూ బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ అనే మాట నిలబెట్టుకున్నాయి.
గాలోడు సినిమా బుల్లి తెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ వెండి తెర స్టార్ గా ఎదిగే మాస్ హీరో రేంజ్lo వసూళ్లు సాధించగా.. హారర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులకు మసూద విపరీతంగా నచ్చింది.
మసూద సినిమా దిల్ రాజు రిలీజ్ చేయడం వలన మంచి డీయేటర్స్ దొరకడం ద్వారా సినిమా పంపిణీధారులకు మంచి లాభాలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా ఆనందంగా బయపడుతూ మసూదను ఇస్తాపడ్డారు.
ఈ రెండు సినిమాలు కాకుండా, ఈ వారంలో వచ్చిన అలిపిరికి అల్లంతదూరంలో, సీతారామపురంలో, బెస్ట్ కపుల్, భారతపుత్రులు లాంటి సినిమాలన్నీ వచ్చాయి…. పోయాయి.
నాలుగో వారం లో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన సినిమాలు: ఎవ్వరికీ తెలియకుండా సడన్ గా రిలీజ్ అయింది లవ్ టుడే అనే డబ్బింగ్ మూవీ. పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కూడా దాటేసి, లాభాల్లోకి వచ్చేసింది.
లవ్ టుడే సినిమా ఇంకా లాభాలు తెస్తుందా అంటే చెప్పలేము. ఎందుకంటే సినిమా ఒరిజినల్ తమిళ నిర్మాత ముందుగా చేసుకొన్న ఓటీటీ ఒప్పందం ప్రకారం డిసెంబర్ 2 వ తేదీ నుండి మా ఓటీటీ lo స్ట్రీమింగ్ మొదలు అవుతుంది అని మొన్న నుంచే ఆ ఓటీటీ సంస్థ ప్రచారం మోదలు పెట్టింది.
లవ్ టుడే తో పాటు అల్లరినరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాకు మొదటి రోజు మీడియా రివ్యూ లలో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగు ప్రజానీకం మాత్రం లవ్ టుడే కె ఓటు వేసి అత్యాదిక మాజరిటీ తో గెలిపించారు. లవ్ప్ర….భంజనం ముందు ఇట్లు….నిలబడలేకపోయింది.
రిలీజైన 3 రోజులుకే రియల్ బాక్స్ ఆఫీసు నంబర్స్ చూసి డీసెంట్ టాక్ అన్న మీడియా కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ దిశగా పోయింది అంటూ రాస్తున్నారు. ఇక తోడేలు (హిందీ భేదియ), రణస్థలి, వల, మన్నించవా సినిమాలు వచ్చాయి, పోయాయి.
ఈ నవెంబర్ నెలలో స్ట్రయిట్, డబ్బింగ్ సినిమాల మధ్యలో రీ-రిలీజెస్ కూడా ఉన్నాయి. అవి నువ్వే నువ్వే, ప్రతిబింబాలు, వర్షం, రెబల్, బాద్ షా సినిమాలు లిమిటెడ్ గా మల్టీ ఫ్లేక్స్ షోస్ రూపం లో కొన్ని సింగల్ స్క్రీన్ థియేటర్లలో రిలీజయ్యాయి.
అయితే వాటి ప్రభావం ఎంత అనేది ట్రేడ్ పండితులే చెప్పాలి. మా లెక్క ప్రకారం ఓవరాల్ గా నవంబర్ నెలలో లవ్ టుడే, యశోద, గాలోడు సినిమాలు అందర్నీ ఎట్రాక్ట్ చేయగా, మసూద సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ ను ఆకట్టుకుని నిర్మాతకు పంపినీహదారులకు ప్రాఫిట్ ని ఇచ్చింది.
ఈ నెల డిసెంబర్ కదా, సంక్రాంతి సీజన్ లో ప్లేస్ లేని కొన్ని పెద్ద సినిమాలు మూడో వారం రిలీజ్ అవుతూ క్రిష్మస్, న్యూ ఇయర్ ని టార్గెట్ చేశాయి. చూద్దాం వాటి జాతకాలు ఎలా ఉన్నాయో..
* కృష్ణ ప్రగడ.