Komati Reddy Unleashed a Teaser Of ‘Sita Kalyana Vaibhogame’: ‘సీతా కళ్యాణ వైభోగమే’ టీజర్‌ను రిలీజ్ చేసిన తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి !

KomatireddyKVR launched the teaser SeethaKalyanaVaibhogame e1713543865802

సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయించారు.

KomatireddyKVR launched the teaser SeethaKalyanaVaibhogame2

నల్ల నల్ల నీళ్లలోనా తెల్లని చేప అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో పాట.. హీరో హీరోయిన్లు పరిచయం, గ్రామీణ వాతావరణం, ఊరు అందాలను ఓపెన్ చేస్తూ టీజర్‌ను ప్రారంభించారు. ఆ వెంటనే గోవాకు లొకేషన్ మార్చేశారు. అటుపై యాక్షన్ సీక్వెన్స్‌ను, గగన్ విహారి విలనిజాన్ని చూపించారు. ‘నా పెళ్లాం లేచిపోయింది.. సీత నాది’ అంటూ విలన్ చెప్పిన డైలాగ్స్, చేజింగ్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి.

‘సీతమ్మ లేని గుడి రాముడి గుడే కాదు.. గుడిని మూసేయండి’ అని చెప్పే డైలాగ్.. ఆ తరువాత చూపించిన యాక్షన్ సీక్వెన్స్, హీరో వీరోచిత పోరాటాలు అదిరిపోయాయి. ‘సీత ఎప్పటికీ రాముడిదే’ అంటూ టీజర్ చివర్లో హీరో చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ టీజర్‌ను రిలీజ్ చేసిన అనంతరం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘టీజర్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాల’ని కోరుకున్నారు.

KomatireddyKVR launched the teaser SeethaKalyanaVaibhogame1

ఈ టీజర్‌లో చరణ్ అర్జున్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ఇక కెమెరామెన్ పరుశురామ్ సహజమైన లొకేషన్లలో, ఎంతో సహజంగా సినిమాను తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. అన్ని అంశాలు జోడించి తీసిన ఈ మూవీ కుటుంబ సమేతంగా చూసేలా ఉంది. ఏప్రిల్ 26న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *