‘చక్రవ్యూహం’ సినిమా సీడెడ్, నైజాం డిస్ట్రుబ్యూషన్ హక్కులను దక్కించుకున్న “మైత్రి మూవీ డిస్ట్రుబ్యూషన్”

chakravyuham e1684176312120

 

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం “చక్రవ్యూహం’ -ది ట్రాప్ అనేది ఉపశీర్షిక..చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీమతి. సావిత్రి నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 2 విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవలే ఈ చిత్ర టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు.

ఆ సందర్భంలో చిత్ర దర్శకుడు మధు సుధన్ మాట్లాడుతూ.. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన మా “చక్రవ్యూహం” చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారికి ధన్యవాదాలు. ఆయన విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.

విరూపాక్ష సినిమాలో తన విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకున్న అజయ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించనున్నారు.

1:05 నిడివి ఉన్న ఈ టీజర్ మొదటినుండి చివరివరకు ఆసక్తికరంగా ఉంది. అద్భుతమైన విజువల్స్ తో అదిరిపోయే బాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ టిజర్   ఆకట్టుకుంటుంది.

మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ “చక్రవ్యూహం” చిత్రాన్ని జూన్ 2 గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు చిత్ర బృందం. ఈ చిత్రం సీడెడ్, నైజాం డిస్ట్రుబ్యూషన్ హక్కులను “మైత్రి మూవీ డిస్ట్రుబ్యూషన్” శశిధర్ రెడ్డి దక్కించుకున్నారు. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి వంటి మాస్ కమర్షియల్ హిట్ సినిమాలు తరువాత “మైత్రి మూవీ డిస్ట్రుబ్యూషన్” చేస్తున్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ “చక్రవ్యూహం”.

తారాగణం: అజయ్, జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రజ్ఞా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్, కిరీటి, రాజ్ తిరందాసు, రవితేజ, మోహన్.

రచన & దర్శకత్వం: చెట్కూరి మధుసూధన్
నిర్మాత: సహస్ర క్రియేషన్స్
సహ నిర్మాతలు: వెంకటేష్ & అనూష
డాప్: జి వి అజయ్ కుమార్
ఎడిటర్: జెస్విన్ ప్రభు
సంగీతం: భరత్ మంచిరాజు

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: జాస్తి అజయ్, చిలుక మహేష్
DI:లైట్ లైన్ స్టూడియో
PRO: మేఘా శ్యామ్ , ధీరజ్ – ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *