AP04 రామాపురం సినిమా ట్రైలర్ విడుదల చేసిన యువ నటులు ఏమన్నారంటే !

AP04 RamaPuram trailer launch poster Copy e1669634125208

 

అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం ”AP04 రామాపురం” .

AP04 RamaPuram trailer launch announcement Copy

ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను ప్రముఖ సినీ,రాజకీయ నాయకులు అవిష్కరించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను నేడు ప్రసాద్ లాబ్స్ లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, జెస్సి తో పాటు నటుడు పృథ్వి పాల్గొన్నారు.

AP04 RamaPuram trailer launch team and guests 2 Copy

బిగ్ బాస్ జెస్సి మాట్లాడుతూ..
టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరికి అల్ ది బెస్ట్.

AP04 RamaPuram trailer launch team and guests 3

నటుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ...
మీడియా మిత్రులకు నమస్కారం. ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి మోస్ట్ డేడికేటడ్ వర్కర్. చాలా తక్కువ బడ్జెట్ లో హీరో ఎలివేషన్స్ అవి బాగా తీసాడు. మీడియా మిత్రులే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలి.

డిసంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్న.

AP04 RamaPuram trailer launch poster Copy

హీరో నందు మాట్లాడుతూ…
ఒక టాలెంట్ ను నమ్మి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికి థాంక్యూ అండి. కడపలో సినిమాకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ ఉంది నాకు తెలియదు. కానీ సినిమా చేసారు. అదే ఇక్కడ తీసుంటే ఇంకా బాగా తీసేవాళ్ళేమో. ఈ సినిమాకు మంచి కలక్షన్స్ రావాలని కోరుకుంటున్న.

AP04 RamaPuram trailer launch team and guests 2

సోహెల్ మాట్లాడుతూ…
నన్ను ఇక్కడికి పిలిచినందుకు థాంక్యూ. డైరెక్టర్ చాలా పనులు చేసుకుని ఈ స్థాయికి వచ్చారు.ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఈ సినిమా ను దర్శకుడు తక్కువ బడ్జెట్ లో బాగా చేసాడు. ఈ సినిమా డిసంబర్ 9న రిలీజ్ అవుతుంది చూసి ఎంకరేజ్ చెయ్యండి.

దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ…
ముందుగా ప్రింట్ మీడియాకు కృతజ్ఞతలు 19 ఏళ్ళు అప్పుడు ఈ సినిమా రాయడం స్టార్ట్ చేశాను. 23 ఏళ్లకు డైరెక్షన్ చేశాను. సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండదు అంటారు. కానీ నా సినిమాకోసం ఇంతమంది వచ్చి ఎంకరేజ్ చేసారు అందరికి చాలా పెద్ద థాంక్స్ అండి.

AP04 RamaPuram trailer launch team and guests 3

నిర్మాత మాట్లాడుతూ…
చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మా సినిమాను ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీ అందరికి చాలా పెద్ద థాంక్స్ అండి. మాకు ఉన్న చిన్న బడ్జెట్ లో ఈ సినిమాను చేసాం. ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే ఇంకా మంచి సినిమా తీసేవాళ్ళం. మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

సమర్పించు వారు – ఎస్.వి. శివ రెడ్డి…
ప్రొడ్యూసర్ – రామ్ రెడ్డి అందూరి…
దర్శకుడు – U. హేమ రెడ్డి…
సంగీతం – సాకేత్ వేగి & అబు…
కెమెరా మెన్ – మల్లి కె చంద్ర & వినయ్ కుమర్ జంబరపు…
కొరియోగ్రాఫర్ – రవి తేజ & కిషోర్ RK
పి.ఆర్.ఓ..మధు వి.ఆర్

ఈ సినిమా నటీనటులు
రామ్ జాక్కల
అఖిల ఆకర్షణ
P.N రాజ్
4సునీల్ మల్లెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *