అరేబియ కడలి వెబ్ సిరీస్ రివ్యూ:
1. పరిచయం
ప్రైమ్ వీడియోలో ఆగస్టు 8, 2025న విడుదలైన అరేబియా కడలి — నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సముద్ర సర్వైవల్ థ్రిల్లర్. సత్యదేవ్ – ఆనంది జంటగా, క్రిష్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, వి.వి. సూర్యకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సముద్రం అంచుల్లో ప్రేమ, కుటుంబం, పోరాటం కలగలిపిన కథనాన్ని చూపిస్తుంది.
2. కథ – కథనం :
శ్రీకాకుళం మత్స్యకారులు అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లో చిక్కుకోవడం, అక్కడి నుండి తిరిగి రావాలనే ప్రయత్నంలో ఎదురైన పోరాటం — ఈ ప్రధాన గాధ. మధ్యలో ప్రేమ కోణం, మానవీయ విలువలు, సర్వైవల్ ఎలిమెంట్స్ మిళితం చేసిన ప్రయత్నం కనిపిస్తుంది.
అయితే పేస్ కొన్నిసార్లు నెమ్మదిగా ఉండటం, కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి లాగడమే కథ ఇంపాక్ట్ తగ్గేలా చేస్తుంది.
తండెల్‌తో సారూప్యత :
ఈ సిరీస్ కథలోని ప్రధాన బిందువు — మత్స్యకారులు పొరపాటున విదేశీ జలాల్లో చిక్కుకోవడం — ఇటీవల థియేటర్లలో వచ్చిన తండెల్ సినిమా థీమ్‌తో పోల్చబడింది.
తండెల్లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ మిక్స్‌డ్ ప్యాకేజీగా ఉండగా, అరేబియాన్ కడలిలో యాక్షన్ కంటే సర్వైవల్-డ్రామా, ఎమోషనల్ టోన్ ఎక్కువ.
మేకర్స్ ఇది వేరే రీసెర్చ్ ఆధారంగా తయారైన ఒరిజినల్ కథ అని చెబుతున్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు, నేపథ్యాలు ప్రేక్షకుల్లో “ఇది తండెల్‌లా ఉంది” అనే డిజావూ ఫీలింగ్ ఇస్తాయి.
3. దర్శకుడు, నటి-నటులు ప్రతిభ:
దర్శకుడు వి.వి. సూర్యకుమార్ సముద్రం నేపథ్యాన్ని బలంగా చూపించినా, కథ పీక్ మోమెంట్స్‌ను మరింత ఎలివేట్ చేయడంలో కొంత తడబడ్డాడు.
సత్యదేవ్ సహజమైన నటనతో ప్రధాన పాత్రలో బరువైన ప్రదర్శన ఇచ్చాడు.
ఆనంది పాత్ర పరిమితమైనా భావోద్వేగం అందించింది.
సపోర్టింగ్ కాస్ట్‌లో కొందరు బాగా ఆకట్టుకున్నారు, కానీ కొందరి పాత్రలు పెద్దగా గుర్తుండవు.
4. సాంకేతిక నిపుణులు ప్రతిభ:
సినిమాటోగ్రఫీ (సమీర్ రెడ్డి) – సముద్రం, బీచ్, పడవల సన్నివేశాలు అద్భుతంగా పటాలెక్కాయి.
సంగీతం – నాగవెల్లి విద్యాసాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగ సన్నివేశాలకు ఊతమిచ్చింది.
ఎడిటింగ్ లో పేస్ కంట్రోల్ చేయడంలో కత్తిరింపులు కొంచెం మరింత సూటిగా చేసి ఉండాల్సింది.
5. 18F మూవీస్ టీం అభిప్రాయం:
అరేబియాన్ కడలిలో మంచి ఐడియా, సహజ నటన, బలమైన లొకేషన్స్ ఉన్నాయి. కానీ స్క్రీన్‌ప్లే పటుత్వం, క్లైమాక్స్ ఇంపాక్ట్ లోపించడం వల్ల అది “మంచి ప్రయత్నం” గానే మిగిలిపోయింది.
తండెల్ లా హై ఇంపాక్ట్, టెన్షన్-డ్రైవన్ నేరేషన్‌కి అలవాటు పడిన ప్రేక్షకులకు, ఈ సిరీస్ కొంచెం నెమ్మదిగా, మెల్లగా అనిపించవచ్చు.
18F మూవీస్ రేటింగ్: ⭐⭐✨ (2.5/5)
పంచ్‌లైన్: “అలలు ఎగిసిపడతాయని అనుకున్నాం… కానీ ఈ ప్రయాణం కేవలం తడిపి వదిలేసింది!” 🌊
* కృష్ణ ప్రగడ.