Aanand L Rai buys 40 Cr duplex flat in Andheri: ఆనంద్ ఎల్ రాయ్ అంత డబ్బు పెట్టి ఫ్లాట్ కొన్నది హీరోయిన్ కోసమా? లేక మరేదైనా రకరణం ఉందా?

rai and abhisek

బాలీవుడ్ స్టార్ తోను, సౌత్ స్టార్స్ తోను సినిమా తీసే ఒకే ఒక దర్శక-నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్.  అటు ద‌ర్శ‌కుడిగా, ఇటు నిర్మాత‌గా య‌మ బిజీగా వరస పెట్టి సినిమా లు చేసుకొంటూ క‌నిపిస్తారు.

rai tanu weds Manu

త‌ను వెడ్స్ మ‌ను అనే  సినిమా నుంచి రాయ్ ద‌శ దిశ మారిపోయింది. అక్కడ నుండి ద‌ర్శ‌కుడిగా వ‌రస హిట్స్ ను కొడుతూ, నిర్మాత‌గా కూడా ప‌లు సినిమాల‌ను నిర్మిస్తున్నాడు.

rai at location e1668871042491

అటు నిర్మాత‌గా, ఇటు ద‌ర్శ‌కుడిగా గత 15 యేళ్ల‌లో 20 కి పైగా సినిమాల‌ను రూపొందించాడు రాయ్.

rai at mumbai office

మ‌రి ఇన్ని సినిమాలు చేసిన వాడు ముంబై నగరం లో సుమారు  40 కోట్ల రూపాయ‌లు వెచ్చించి ఒక ఫ్లాట్ కొన‌డం గొప్ప విష‌యమో కాదో కానీ, ఆ విలాస‌వంత‌మైన నివాసాన్ని కొనడం వెనుక పెద్ద కధ ఉంది అని ముంబై టాక్.

rai akhsay

రాయ్ కి  పెద్ద పెద్ద ఇళ్ల‌న్నా, అధిక విస్తీర్ణంతో ఉన్న ఫ్లాట్ అన్నా చాలా ఇష్ట‌మ‌ట‌. ఇలాంటి నేప‌థ్యంలో ఈ భారీ నివాసాన్ని ఇత‌డు ఎందుకు  కొనుగోలు చేసిన‌ట్టు అంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ జరుగుతున్నాయి.

rai heroine kriti sanon

ఇంతకీ విశయం  ఏమిటంటే.. రాయ్ కొన్న ప‌క్క ఫ్లాట్ లోనే  హీరోయిన్ కృతీ స‌న‌న్ ఉంటుందంట. ఇలా ఈ ద‌ర్శ‌కుడు రాయ్ , అలా హీరోయిన్ కృతి  ఇరుగిల్లూ పొరుగిల్లు అయ్యార‌ట‌.

rai kriti flat mates

వాస్త‌వానికి ఆమె ఉంటున్న ఫ్లాట్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ద‌ట‌. ఆలా  బిగ్ బి ఇంట్లోనే కృతి రెంట్ కు ఉంటోంద‌ట‌. ఏకంగా 40 కోట్ల రూపాయ‌ల విలువైన ఇంటిని రెంట్ కు మెయింటెయిన్ చేస్తోందంటూ కృతీది కూడా చాలా విలాస‌వంత‌మైన జీవితమే అంటూ నెటిజన్స్ రెచ్చిపోతున్నారు.

rai amithab

అసలు విశయం ఏంటంటే రాయ్ అండ్ బచ్చన్ సాబ్ చాలా మంచి ఫ్రెండ్స్ ఎప్పటికైనా బచ్చన్ సాబ్ ఇంటి పక్క ఇల్లు తన స్వంత పేరుమీద ఉండాలని రాయ్ ఈ ఫ్లాట్ మార్కెట్ రేట్ కంటే కొంచెం ఎక్కువే చెల్లించి కొన్నట్టు మాకు ఉన్న సమాచారం.

rai and Dhanush in Mumbai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *