Skanda Cult Jathara Update: ‘స్కంద’  కల్ట్ జాతర ఈవెంట్  రామ్ ఏమన్నాడు అంటే !

skanda pre release event highlights 2 e1695664230611

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై  నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన స్కంద ఆల్బమ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

స్కంద టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ కరీంనగర్ లో స్కంద కల్ట్ జాతర ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

skanda pre release event highlights 1

కల్ట్ జాతర ఈవెంట్ లో స్కంద రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఉస్తాద్ రామ్ మ్యాసియస్ట్ యాక్షన్, బోయపాటి హైవోల్టేజ్ ఇంటెన్స్ సీక్వెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో రిలీజ్ ట్రైలర్ మాస్ రాంపేజ్ క్రియేట్ చేసింది.
”నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను..ఆడి యెనకాల ఎవరున్నారో చూడను”
”రింగ్ లో దిగితే రీసౌండ్ రావాలె…చూసుకుందాం..బరాబర్ చూసుకుందాం.” అంటూ ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగులు పవర్ ఫుల్ గా వున్నాయి.

మాస్తో   పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది. తమన్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. సంతోష్ డిటాకే కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా వున్నాయి. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ స్కంద పై అంచనాలని మరింతగా పెంచింది.

skanda pre release event highlights 5

కల్ట్ జాతర ఈవెంట్ లో ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ..  కరీంనగర్ యువతకి, మాస్ కి, అమ్మాయిలకి.. అందరికీ హాయ్. ఇదివరకే ఈ సినిమా  ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. స్పెషల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కరీంనగర్ నిర్వహించడం ఆనందంగా వుంది. ఇక్కడికి వచ్చిన టీం అందరికీ థాంక్స్. బోయపాటి గారి సినిమా అంటే ఫైట్స్ అని అంటారు. ఐతే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు.. ఆ ఫైట్స్ వెనుక ఎమోషన్. ఆ ఎమోషన్ ని ఎలా బిల్డ్ చేస్తారనేది స్కంద కీ ఎలిమెంట్. స్కంద కేవలం మాస్ సినిమానే కాదు. చాలా అందమైన ఫ్యామిలీ ఎలిమెంట్స్ వున్నాయి. ఈ సినిమాకి సోల్ ఫ్యామిలీ ఎమోషన్స్. బోయపాటి గారు ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ పెడతారు. ఇందులో మెసేజ్ ని కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేస్తారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు. skanda pre release event highlights 7

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ముందుగా జై బాలయ్య. కరీంనగర్ లో స్కంద వేడుక జరగడం చాలా ఆనందంగా వుంది. నేను సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడతాను. ఒక్కసారి అవుట్ పుట్ వచ్చిన తర్వాత ఇంక టెన్షన్ వుండదు. ఎందుకంటే చాలా బాగా తీశాననే నమ్మకం. స్కంద చాలా మంచి సినిమా. మంచి సినిమా తీసి మీ ముందుకు వస్తున్నాం. మంచి సినిమాని ఖచ్చితంగా అందరూ మనస్పూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

సాయి మంజ్రేకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. బోయపాటి గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే రామ్ గారు కూడా. రామ్ గారు  చాలా మంచి వ్యక్తి. ఆ మంచితనం మీకు తెరపై కనిపిస్తుంది’’ అన్నారు.

skanda pre release event highlights

శ్రీకాంత్ మాట్లాడుతూ.. రామ్ ని ఇస్మార్ట్ శంకర్ లో చూసి ఇంతకంటే ఎనర్జిటిక్ సినిమా ఏం వస్తుందని అనుకున్నాను. స్కంద లో దానికి మించిన ఎనర్జీ వున్న సినిమా.  రామ్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నిజాయితీగా పని చేస్తారు. స్కంద చాలా మంచి సినిమా అవుతుంది. బోయపాటి గారితో పని చేయడం ఇది మూడోసారి. సరైనోడు, అఖండ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు స్కంద కూడా పెద్ద విజయం సాధిస్తుంది. స్కంద నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఖర్చు చేశారు. రామ్ బోయపాటి సినిమా అభిమానులందరికీ ఒక పండగలా వుంటుంది’’ అన్నారు

skanda pre release event highlights 4

ప్రిన్స్ మాట్లాడుతూ.. రామ్ పేరు చెప్పగానే ఒక ఎనర్జీ వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన బోయపాటి గారికి, నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి గారి ధన్యవాదాలు. సినిమా షూటింగ్ అంతా సరదాగా జరిగింది. 28న స్కంద ఐదు భాషల్లో విడుదలవుతోంది, తప్పకుండా అందరూ థియేటర్ లో చూడాలి. స్కంద తప్పకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’’అన్నారు. ఈ ఈవెంట్ లో ఇంద్రజ, శ్రవణ్, రచ్చ రవి తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *