vijay new still e1669865457268

తెలుగు సినిమా ఇండిస్ట్రీ లో ఉన్న సెంటిమెంట్ పిచ్చి మరో ఏ సినిమా ఇండిస్ట్రీ లోనూ ఉండక పోవచ్చు. సంక్రాంతి, సమ్మర్, దసరా మరియు దీపావళి ఇలా ఏ సీజన్ లో అయినా ఒక హీరో  సినిమా వచ్చి హిట్ అనే ముద్ర పడిందా.. అంతే !

అదే సెంటిమెంట్ ఫాలో అవుతారు మన తెలుగు నిర్మాతలు. సినిమా రిలీజ్ టైమ్ కి వారు నమ్మిన కధ, దర్శకుడు, హీరో ఎవరు గుర్తికి రారు…ఒక్క సెంటిమెంట్ తప్ప.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో  గత 20 సంవత్సరాలుగా మోస్ట్ సక్సెస్ రేట్ తో హైహిస్ట్ హిట్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు గారూ, బాహుబలి ఇచ్చిన బూస్ట్ తో తెలుగు సినిమా నిర్మాణం నుండి ఇతర భాషా చిత్రాల నిర్మాతగా ఎదుగుతున్నారు…. తప్పులేదు !

DIL RAJU

 ఎవరైనా … ఎక్కడైన… బిజినెస్ చేసుకోవచ్చు..!

కానీ, హిట్ కాంబో, సెంటిమెంట్ అంటూ లెక్కలు వేసుకొంటూ బిజినెస్ చేస్తేనే ప్రాబ్లం. ఆ సెంటిమెంట్ గాని, హిట్ కాంబో కానీ రివర్స్ అయ్యిందా అంతే సంగతులు. కొలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.

ప్రస్తుతం మన ఈ  కధ కు మూల కారణం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్త. అది ఏంటంటే  గత సంక్రాంతి కి అంటే 2021 లో మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాల తో పాటు తమిళ సూపర్ స్టార్  విజయ్ నటించిన మాస్టర్ సినిమా కూడా వచ్చి హిట్ అయ్యింది.

అదే సెంటిమెంట్ ఇప్పుడు వచ్చే సంక్రాంతి కి  అంటే 2023 లో కూడా  తెలుగు సూపర్ స్టార్స్  స్ట్రెయిట్ సినిమాల తో పాటు తమిళ స్టార్  విజయ్ నటించిన  వారసుడు కూడా హిట్ అవుతుంది అని తెలుగు డిస్తిబ్యూటర్స్ అందరికీ  దిల్ రాజు గారి క్రియేటివ్  టీం నమ్మయిస్తుంది ఆట.

కానీ మన తెలుగు చిత్ర సీమ లొని కృష్ణా నగర్ సినీ పండితులు చెప్పే సెంటిమెంట్ మరోలా ఉంది. వారు చెప్పే సెంటిమెంట్ కి దగ్గరగా గత డబ్బింగ్ చిత్రాల చరిత్ర ను చెప్తున్నారు. ఆ  విశయాలు మన యువ సినీ విమర్శకులు గూగుల్ తల్లిని అడిగి తెలుసు కొని ఆ  సినిమా పేర్లు, ఏ  సంవత్సరం లో వచ్చాయి అనే విశయాలు అన్నీ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.

తెలుగు సినీ పండితులు చెప్పేది ఏంటా అని చూస్తే… మన తెలుగు  సంక్రాంతికి విడుదలయ్యే డబ్బింగ్ సినిమాలు హిట్ కావు అన్నది వారి  వారు చెప్తున్న సెంటిమెంట్.

ఇంకా లోతుగా పరిశోదన చేస్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన జాబితా ప్రకారం 1997 లో హిట్లర్ & పెద్దన్నయ్య తో తమిళ డబ్బింగ్ సినిమా లు ‘ఇద్దరు’, ‘మెరుపు కలలు‘ పోటీ పడ్డాయి. ఆ రెండు డబ్బింగ్ సినిమాలు ఎగ్జిబీటర్స్ కి నస్టాలు మిగిల్చాయి.

అలానే  2015 లో తెలుగు సూపర్ స్టార్స్ పవన్ కళ్యాణ్ – వెంకటేశ్ ల  గోపాలా గోపాలా సినిమా తో తమిళ డబ్బింగ్ సినిమా శంకర్ – విక్రమ్ ల ‘ఐ’ సినిమా పోటీ పడింది. మరలా 2018లో బాల్య కృష్ణ – జై సింహా, పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల  అజ్ఞాతవాసీ తో సూర్య – ‘గ్యాంగ్‘ సినిమా ఢీకొంది.

ఇంకా 2019 లో  ఎఫ్2 , వినయ విధేయ రామ, ఎన్ టి ఆర్ కథానాయకుడు సినిమాలతో సూపర్ స్టార్ రజినికాంత్  ‘పేట’ పోటీ పడింది. మరలా  2020 లో మహేష్ బాబు – సరిలెరునీకెవ్వరు, అల్లు అర్జున్ – అలావైకుంఠపురములో సినిమాలతో రజిని కాంత్ – ‘దర్బార్’ సినిమా  విడుదలైంది. ఇలా రిలీజ్ అయిన ప్రతి డబ్బింగ్ సినిమా నెగిటివ్ రిజ‌ల్ట్ నే తెచ్చుకుంది.

ఆ సెంటిమెంట్ ని 2021 సంవత్సరం సంక్రాంతి కి  తలపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా  తెలుగు స్ట్రెయిట్ సినిమాలు  క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ లతో పాటు విడుదల అయి హిట్ అనిపించుకుంది.

అది ఎలా అంటే రెడ్, అల్లుడు అదుర్స్ సరైన ఫలితాల సాధించకపోవడంతో సినిమానే ప్రపంచం అనుకొనే తెలుగు ప్రేక్షకులు రవితేజ క్రాక్ తో పాటు  విజయ్ – మాస్టర్ సినిమా కూడా చూసి మంచి పాజిటివ్ ఫలితాన్నే ఇచ్చారు .

Vijay new still from Varasudu 7

ఆ విధంగా  పాత సంక్రాంతి డబ్బింగ్ ఫ్లాప్ సెంటిమెంట్ ను తలపతి విజయ్  బ్రేక్ చేసినట్లు అయింది.

అదే విశయాన్ని వచ్చే సంక్రాంతి సినిమాల  బిజినెస్ కి సెంటిమెంట్ పులిహోర కలిపి వడ్డిస్తాము అని చెప్తూ తెలుగు రాష్ట్రాలలో తెలుగు స్ట్రెయిట్ సినిమాల కంటే అధిక డీయేటర్స్ లో తమిళ వారసుడు ని రిలీజ్ చేయడానికి దిల్ రాజు టీం ప్రయత్నిస్తుంది అన్నది ప్రోడుసర్స్ కౌన్సిల్ ఆరోపణ.

నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ గారిని ఇదే విశయం మీద అడిగితే..

prasanna kumar

గతం లో అంటే 2019 సంక్రాంతి కి దిల్ రాజు చెప్పిన మాటల ప్రకారం ఈ సంక్రాంతికి తెలుగు సూపర్ స్టార్స్ బాలకృష్ణ వీరసింహారెడ్డి- మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య అనే రెండు  స్ట్రెయిట్ తెలుగు సినిమాలు వస్తున్నాయి కనుక డీయేటర్స్ యజిమానులు తెలుగు నిర్మాతల శ్రేయస్సు కోరి ఫస్ట్ ప్రయారిటీ స్ట్రెయిట్ తెలుగు సినిమా లకు ఇవ్వండి అని  చెప్తున్నాము అని అన్నారు.

మరి సెంటిమెంట్ ని నమ్మేవారిని ఏమాణాలి?,

సెంటిమెంట్ చెప్పి వ్యాపారం చేసే వారిని ఏమాణాలి?,

లేక డబ్బు పలుకుబడి ఉన్నవాడిదే  పై చేయి.. 

అని తరుచుగా పెద్దలు చెప్పే మాటలు గుర్తుచేసుకోవాలా !.

చూద్దాం ఈ కోడి బుర్రల యుద్దం సంక్రాంతి కోడి పందాల లా ఇంటరెస్టింగ్ గా ఉంటాదా లేక హిడెన్ ఎజెండా తో  మీడియా ను తమ సినిమా పబ్లిసిటీ కోసం వాడుకొంటూ ఎవరు వ్యాపారం వారు చేసుకొంటున్నారా !

* కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *