ఆర్కా మీడియా నిర్మాణంలో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న “యక్షిణి”

IMG 20240510 WA0034 e1715438153496

పలు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లతో ఓటీటీ లవర్స్ కు ఫేవరేట్ గా మారింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ త్వరలో “యక్షిణి” అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ‘ఆర్కా మీడియా వర్క్స్‘ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని “యక్షిణి” సిరీస్ ను రూపొందిస్తున్నారు.

రీసెంట్ గా “యక్షిణి” కమింగ్ సూన్ అంటూ ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాలు, వెబ్ సిరీస్ లకు భిన్నమైన కాన్సెప్ట్ తో “యక్షిణి”ని రూపొందించారు. ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో “యక్షిణి” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *