కార్తికేయ ‘బెదురులంక 2012’లో ‘చిత్ర’గా నేహా శెట్టి, ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసిన టీం !

neha shetty బెదురులంక 2021 e1670222120339

 

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బెదురులంక 2012′. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు.

ఈ చిత్రంలో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు.

NEHA SHETTY DJ TILLU 2 HEROINE

ఈ సందర్భంగా సినిమాలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

‘బెదురులంక 2012’లో చిత్ర పాత్రలో నేహా శెట్టి కనిపించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర ఆమె చేస్తున్నారని తెలియజేసింది.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “సంప్రదాయబద్ధంగా కనిపించే మోడ్రన్ అమ్మాయి చిత్ర. పైకి బార్బీ బొమ్మలా కనిపిస్తుంది కానీ… లోపల ఆర్డీఎక్స్ బాంబ్ లాంటి మనస్తత్వం ఆమెది. అందంగా కనిపిస్తూ… అభినయంతో నేహా శెట్టి ఆకట్టుకుంటారు. కార్తికేయ, నేహా కాంబినేషన్… వాళ్ళిద్దరి సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి.

Karthikeya Bedurulanka 2012 poster

డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం” అని చెప్పారు.

చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ “మా హీరోయిన్ నేహా శెట్టి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమాలో ఆమె రోల్ చాలా బావుంటుంది. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వినోదాత్మక చిత్రమిది. చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలో సినిమా కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

kartikeya bedurulanka 2012

కొత్త ఏడాదిలో చిత్రాన్ని విడుదల చేస్తాం. థియేటర్లలో ప్రేక్షకులు కొత్త సినిమా చూస్తారు. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయి” అని చెప్పారు.

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.

కార్తికేయ బెదురులంక పోస్టర్

ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృధ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం: క్లాక్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *